జపనీయుల ప్రత్యేక యాగం.. లోక కల్యాణమే లక్ష్యం.. ఎక్కడంటే... - తమిళనాడు జపనీయుల యాగం
Japanese Special Yagam: తమిళనాడులోని తిరువణ్నామలై నగర సమీపంలో అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. దేవనాంపాటు గ్రామంలో వెలసిన స్వయంభు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం జపనీయులు ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. టకా యికి ఓషి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పది మందికి పైగా జపనీయులు హాజరయ్యారు. యాగం పూర్తయ్యాక సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జపాన్లో నివాసం ఉంటున్న తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ యాగానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. సంస్కృత వేద మంత్రాలను జపనీయులు పఠిస్తుంటే గ్రామ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ తన్మయత్వానికి లోనయ్యారు.