తెలంగాణ

telangana

ETV Bharat / videos

20వేల అడుగుల ఎత్తులో.. గడ్డకట్టించే చలిలో.. ఐటీబీపీ జవాన్ల యోగా - ఐటీబీపీ హిమాలయాలు

By

Published : Jun 6, 2022, 1:27 PM IST

ITBP Yoga At Himalayas: ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు అరుదైన రికార్డు సాధించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో.. 22,850 అడుగుల ఎత్తుపై సుమారు 20 నిమిషాల పాటు ఐటీబీపీ జవాన్లు యోగా సాధన చేశారు. జూన్​ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత రెండు నెలలుగా.. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, త్రివిధ దళాలు, పారా మిలిటరీ విభాగాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మౌంట్​ అబి గామిన్ పర్వతారోహణలో భాగంగా.. హిమవీరులు ఈ రికార్డు సాధించారు. అత్యధిక ఎత్తులో యోగా ప్రాక్టీస్ సెషన్‌ జరగడం ఇదే తొలిసారి. ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పించడానికి.. తాము హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో యోగా చేస్తున్నట్లు ఐటీబీపీ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details