తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరెంట్ వైర్ల కింద డీజే వ్యాన్​లపై డ్యాన్స్​.. ఒకరు మృతి - dj vehicle current shock

By

Published : Aug 8, 2022, 7:19 PM IST

DJ current shock death video: డీజే సంగీతానికి లోకాన్ని మర్చిపోయి డ్యాన్స్​ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్​ ఇందోర్ జిల్లా మౌ మండలం మేమ్దీ గ్రామంలో సోమవారం జరిగిందీ ఘటన. కావడి యాత్రలో భాగంగా కొందరు యువకులు రెండు డీజే వాహనాలు ఏర్పాటు చేశారు. మౌ-సిమ్రోల్ రోడ్​లో డీజే వ్యాన్​లను పక్కపక్కనే ఆపి, వాటిపై ఎక్కి ఉత్సాహంగా నృత్యం చేశారు. అయితే.. ఆ వ్యాన్​పై డ్యాన్స్​ చేస్తున్న ఓ వ్యక్తి చెయ్యి.. పైన ఉన్న హైటెన్షన్​ కరెంట్ తీగను తాకింది. ఒక్కసారిగా షాక్ తగిలింది. ఐదుగురు అక్కడికక్కడే కుప్పకూలారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరు మరణించారు. మిగిలిన వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details