జెండాకు సెల్యూట్ చేస్తూ మాజీ జవాన్ మృతి - independence day ex soldier death
స్వాతంత్ర్య దినోత్సవం వేళ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తూనే ప్రాణాలు విడిచారు ఓ మాజీ సైనికుడు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా కడబ మండలం కుట్రుపడి గ్రామంలో సోమవారం జరిగిందీ ఘటన. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలకు మాజీ జవాన్ గంగాధర గౌడ హాజరయ్యారు. స్థానిక సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ త్రివర్ణ పతాకం ఎగరవేస్తుండగా.. జెండాకు సెల్యూట్ చేస్తూ ఒక్కసారిగా గంగాధర గౌడ కుప్పకూలారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. దారిలోనే తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో కుట్రుపడి గ్రామస్థులంతా విషాదంలో మునిగిపోయారు.