పాన్ ఇప్పించలేదని రచ్చరచ్చ.. కర్రలతో దాడి.. - సర్దార్ నగర్లో వద్ద వివాదం
గుజరాత్లో దారుణం జరిగింది. పాన్ షాపు దగ్గర జరిగిన చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణం మీదకు వచ్చింది. సూరత్.. సర్దార్ నగర్లో షకీల్ అనే యువకుడు పాన్ మసాలా తినేందుకు దుకాణానికి వచ్చాడు. అంతలోనే సోహైల్, సమీర్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి గుట్కా, పాన్ ఇప్పించాలని షకీల్‌ను డిమాండ్ చేశారు. అందుకు షకీల్ ససేమిరా అన్నాడు. తన వద్ద డబ్బులు లేవని.. అయినా తానెందుకు పాన్ ఇప్పించాలని ప్రశ్నించాడు. దీంతో నిందితులిద్దరూ అసభ్య పదజాలంతో తిడుతూ కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగారు. బాధితుడు షకీల్‌ను ఆసుపత్రిగా తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన లింబయత్ పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగింది. సీసీటీవీలో ఈ దాడి దృశ్యాలన్ని రికార్డయ్యాయి.