అదరహో అనిపించిన అమ్మాయిల అందాల పోటీలు, ఎక్కడంటే - విల్లామేరీ కళాశాలలో ఫ్రెషర్స్ డే
హైదరాబాద్ సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే ఆకట్టుకుంది. అమ్మాయిల కోలాహలంతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది. పాటలకు నృత్యాలు చేస్తూ విద్యార్థులు అలరించారు. కేరింతలు కొడుతూ మిగతావారు ఉత్సాహపరిచారు. ప్రతి ఏడాది నిర్వహించే విల్లామేరీ మిస్ అందాల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో అమ్మాయిలు ర్యాంప్ వాక్ చేస్తూ అదరహో అనిపించారు.