'గణేశ్' మ్యూజియంలా ఇల్లు.. 600 విగ్రహాలు సేకరించిన భక్తుడు - వినాయక మ్యూజియంగా మారిన ఇల్లు
సాధారణంగా విఘ్నేశ్వరుడు అంటే అందరికీ భక్తి, ఇష్టం ఉంటుంది. కర్ణాటకలో ఓ వ్యక్తి మాత్రం అంతకుమించి అంటున్నారు. అందుకే తన ఇంటినే గణపతి మ్యూజియంగా మార్చారు. బళ్లారిలోని ఆదర్శ్ నగర్‌కు చెందిన అశోక్ బచావత్ 21 ఏళ్లుగా గణేశ్ విగ్రహాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో దాదాపు 600 ప్రతిమలు ఉన్నాయి. మట్టి, చెక్క, ముత్యాలు, థర్మాకోల్, కాగితం, ఇత్తడి, ఇనుము, వెండి వంటి వాటితో చేసిన అనేక రకాల గణేశ్ విగ్రహాలు కనిపిస్తాయి. మొదట్లో కుటుంబసభ్యులు ఈ విగ్రహాల సేకరణకు అడ్డుపడినా.. అశోక్ ఆసక్తిని అర్థం చేసుకుని వారు కూడా అండగా నిలిచారు.