అంతా చూస్తుండగానే కూలిన ఇల్లు, 50 అడుగుల మేర గుంత - మహారాష్ట్ర న్యూస్
మహారాష్ట్రలో ఘోరం జరిగింది. అంతా చూస్తుండగానే ఓ ఇల్లు అకస్మాత్తుగా కూలి 50 అడుగుల గుంత ఏర్పడింది. చంద్రాపుర్ జిల్లాలోని ఘుఘ్గస్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. బ్రిటీష్ కాలంలో అక్కడ భూగర్భ బొగ్గుగని ఉండేదని.. 1985లో దాన్ని ఉపరితల బొగ్గు గనిగా మార్చారని స్థానికులు చెప్పారు. ఘుఘ్గస్ పట్టణం బొగ్గుగనిపైనే ఉందని... పక్కనే ఉన్న వర్ధానది ఉప్పొంగడంతోనే ఇలా జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై నిపుణుల బృందం విచారణ జరుపుతోంది. అప్రమత్తమైన అధికారులు.. సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Last Updated : Aug 27, 2022, 2:08 PM IST