పోచమ్మ బోనాల్లో భక్తులపై తేనెటీగల దాడి.. ఎమ్మెల్యేపైనా..! - honey Bee attack on devotees at Pochamma Bonalu
Honey Bees Attack: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లిలో భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. పోచమ్మ బోనాలు సమర్పిస్తుండగా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఆలయం సమీపంలో ఉన్న చెట్టుపైకి పొగ వెళ్లడంతో.. ఒక్కసారిగా లేచిన తేనెటీగలు.. బీభత్సం సృష్టించాయి. తేనెటీగల దాడితో భక్తులంతా పంట పొలాల్లోకి పరుగులు తీశారు. అదే సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపైనా తేనెటీగలు దాడి చేశాయి. దాంతో పూజలు చేయకుండానే ఆయన వెనుదిరిగారు. అనంతరం గాయపడ్డ భక్తులను స్థానిక ప్రాథమిక కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.