డ్యాన్సింగ్ పోలీస్.. స్టెప్ వేస్తే క్షణాల్లో ట్రాఫిక్ క్లియర్
ఉత్తరాఖండ్ దెహ్రాదూన్కు చెందిన ఓ హోంగార్డ్.. ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో తనదైన ముద్ర వేశారు. సిటీ హార్ట్స్ ఆస్పత్రి సమీపంలోని జంక్షన్ వద్ద నృత్యం చేస్తూ వాహనాలను నియంత్రిస్తారు జోగేంద్ర కుమార్. ఇలా చేయడం.. ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తుందని, ట్రాఫిక్ నియంత్రణ సులువుగా సాగుతుందని అంటున్నారు ఆయన. జోగేంద్ర కృషిని గుర్తించారు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్. ట్రాఫిక్ నియంత్రణలో విశేష కృషి చేసినందుకు డిసెంబర్ 6న హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ రైజింగ్డే రోజు ఆయన్ను సత్కరించాలని నిర్ణయించారు.