కుండపోత వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం.. హెలికాప్టర్లతో సహాయక చర్యలు - గుజరాత్ అప్డేట్లు
Heavy Rains In Gujarat: గుజరాత్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్‌లో గత 5 ఏళ్లలో జులై నెలలో ఎన్నడూ లేనంత రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. కేవలం 3 గంటల్లోనే 115 మిల్లీ మీటర్లకుపైగా వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. పలు ప్రాంతాల్లో భవనాల్లోకి భారీగా వరదనీరు చేరింది. సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్‌లు నీటితో నిండిపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండడం వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వల్సాద్ జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న వందలాది మంది ప్రజలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వరదనీటిలో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు.
Last Updated : Jul 11, 2022, 5:40 PM IST