ఒక్కసారిగా విరిగిపడిన భారీ కొండచరియ.. చిక్కుకుపోయిన 40 మంది ప్రయాణికులు - విరిగిపడిన భారీ కొండ చరియ
ఉత్తరాఖండ్.. పితోర్గఢ్ జిల్లాలోని నజాంగ్ తంబా గ్రామంలో ఒక్కసారిగా భారీ కొండచరియ విరిగిపడింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా దుమ్ముతో నిండిపోయింది. నజాంగ్ తంబా గ్రామానికి చుట్టుపక్క ఉన్న ఏడు గ్రామాలతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో మానససరోవరం వెళ్తున్న 40 మంది ప్రయాణికులు.. కొండ చరియ విరిగిపడడం వల్ల చంబా గ్రామంలో చిక్కుకుపోయారు.