తెలంగాణ

telangana

ETV Bharat / videos

డ్యాన్స్​ చేస్తూ గుర్రంపై నుంచి పడిన వరుడు.. స్ట్రెచర్​పైనే పెళ్లి - నాగ్​పుర్​ వార్తలు

By

Published : Jun 3, 2022, 12:18 PM IST

Groom Fell From Horse: సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు కారులో లేదా ఏదైనా వాహనంలో కల్యాణమండపానికి చేరుకుంటాడు. మహారాష్ట్ర నాగ్​పుర్​ జిల్లాకు చెందిన ఓ వరుడు మాత్రం గుర్రంపై రావాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే.. కల్యాణ వేదిక సమీపస్తున్న సమయంలో మంచి డీజే పాట విని ఊపు ఆపుకోలేక గుర్రంపైనే డ్యాన్స్​ చేశాడు. దీంతో వెంటనే ఆ గుర్రం హడలెత్తి వరుడిని కిందపడేసింది.పెళ్లికొడుకు కుడి కాలు విరిగింది. గుర్రంమీద మండపానికి వెళ్లాల్సిన యువకుడు.. స్ట్రెచర్​పై చేరుకున్నాడు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు వివాహాన్ని వాయిదా వేయకుండా.. యువకుడిని స్ట్రెచర్​పై పడుకోబెట్టి పెళ్లితంతు జరిపించారు. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది.

ABOUT THE AUTHOR

...view details