కరెన్సీ వెలుగుల్లో దర్శనమిస్తున్న గణపతి.. ఎక్కడంటే.? - లక్ష్మీ అవతారంలో గణపతి
Currency Ganesh: కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని 11లక్షల 11వేల 116 రూపాయలతో అలంకరించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లంబోదరుడు భక్తులకు లక్ష్మీ గణపతి అవతారంలో దర్శనమిచ్చారు. అనంతరం వేదపండితులచే నిర్వహించిన హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.