వరంగల్లో భారీ వర్షం.. మందకొడిగా సాగుతున్న నిమజ్జన ప్రక్రియ - Latest news of heavy rain in Warangal district
వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రహదారులపైకి నీరు రావడంతో గణనాథుల నిమజ్జనం ఆలస్యం అవుతుంది. తద్వారా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా నిమజ్జన ప్రక్రియ ఆలస్యంగా సాగుతుందని.. రేపు ఉదయం వరకు నిమజ్జనం సాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ నగరంలో గణేశ్ శోభయాత్రతో వీధులన్ని కోలాహలంగా మారాయి. వర్షంలోనూ యువత కేరింతలు, నృత్యాలతో, హోరెత్తిస్తున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహారాజ్కి జై అనే నినాదాలతో నగరం మారుమోగుతుంది.