బట్టలు ఆరేసే తీగల్లో చిక్కుకుని విలవిల్లాడిన కోతి - కోతి వార్తలు
Monkey Trapped Video: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ఖఢ్ఖఢీలో ఓ కోతుల గుంపు హల్చల్ చేసింది. ఓ ఇంటి మేడపై చేరి స్థానికులను హడలెత్తించింది. అయితే ఈ గుంపులోని ఓ కోతి బట్టలు ఆరేసే తీగల్లో చిక్కుకుని విలవిల్లాడింది. దాని అరుపులు విని మిగతా కోతులు కూడా అక్కడే గుమికుడాయి. దీంతో తీగల్లో చిక్కుకున్న కోతిని కాపాడేందుకు ఎవరూ సాహసించలేదు. అటవీ సిబ్బందికి సమాచారం అందగా.. కాసేపటికి వారు రంగంలోకి దిగారు. కోతిని విడిపించి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద సాధారణం అయిపోయిందని, రోజూ ఇలాంటి ఘటనల గురించి ఫోన్ కాల్స్ వస్తుంటాయని అటవీ అధికారి దినేశ్ నౌడియాల్ తెలిపారు.