Car Fire Video: పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు - పార్కింగ్ చేసిన కారులో మంటలు
Fire in Car: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ గాజువాకలో అగ్నిప్రమాదం జరిగింది. షీలా నగర్ కృషి ఐకాన్ ఆస్పత్రి పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కారులో నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో.. అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.