తెలంగాణ

telangana

ETV Bharat / videos

ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. వాచ్​మెన్ కుటుంబం త్రుటిలో.. - మధ్యప్రదేశ్​ వార్తలు

By

Published : Jun 13, 2022, 10:16 AM IST

Updated : Jun 13, 2022, 10:23 AM IST

Fire Accident Transformer Factory: మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో ఓ ట్రాన్స్​ఫార్మర్​ ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిచాయ్ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్​లోని ఓ ఫ్యాక్టరీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే.. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. ఒక్కసారిగా భారీగా మంటల ఎగసిపడటం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఫ్యాక్టరీలో ఉన్న వాచ్‌మెన్‌ కుటుంబీకులు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Last Updated : Jun 13, 2022, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details