తెలంగాణ

telangana

ETV Bharat / videos

జవాన్లు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం.. రోడ్డుపైనే హైడ్రామా! - హరిద్వార్​ వార్తలు

By

Published : Jul 2, 2022, 11:50 AM IST

ఉత్తరాఖండ్​.. హరిద్వార్​లోని దెహ్రదూన్​ జాతీయ రహదారిపై గంటకుపైగా హైఓల్టేజ్​ డ్రామా నడిచింది. ఆర్మీసిబ్బంది, పోలీసులు మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కారును ఢీకొట్టడం వల్ల వివాదం మొదలైంది. ఎస్​ఐ అనిల్​.. కోర్టుకు వెళ్లి వస్తున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో ఎస్​ఐ.. ఆర్మీ సిబ్బందిని ట్రక్కుతో సహా పోలీస్​స్టేషన్​కు రమ్మని చెప్పడం వల్ల ఇరుపక్షాల మధ్య వాగ్వాదం పెరిగింది. దీంతో ఒక్కసారిగా ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. జవాన్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పామని, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారని ఎస్​ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details