చేనేత వస్త్రాల్లో అతివలు... అందాలకు కళ్లు జిగేలు... - హంసనడకలతో
చేనేత కళాకారులు తయారు చేసిన విభిన్న వస్త్రాల్లో మోడల్స్ మెరిసిపోయారు. పలువురు డిజైనర్లు రూపొందించిన చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్‌పై హంసనడకలతో హోయలొలికించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అర్కాయం ఫెస్టివ్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ లోగో అవిష్కరణ కార్యక్రమం కోలాహలంగా సాగింది. కార్యక్రమంలో సినీ యువ కథానాయిక అనన్య సోనీ పాల్గొన్నది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులతో ఫ్యాషన్‌షో నిర్వహించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో మోడల్స్ ఆకట్టుకున్నారు. ఈనెల 27 నుంచి 3 రోజుల పాటు తాజ్ దక్కన్ హోటల్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు.