తెలంగాణ

telangana

ETV Bharat / videos

పైన కొండ.. కింద నది.. మధ్యలో శునకం.. చివరకు ప్రాణాలు దక్కాయిలా... - హిమాచల్​ప్రదేశ్​ కుల్లూ

By

Published : May 5, 2022, 11:21 AM IST

Sonu Thakur Rescued Dog: కొండ మధ్యలో చిక్కుకున్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడిన ఘటన హిమాచల్​ ప్రదేశ్​ కుల్లూలో వెలుగుచూసింది. మణికర్ణ్​ వ్యాలీలోని రుద్రనాగ్​ వద్ద ఓ కొండ అడుగుభాగాన కుక్క చిక్కుకుంది. కింద నది ఉండటం వల్ల ముందుకు వెళ్లలేక, పైకి ఎక్కలేక ఆపసోపాలు పడుతుంది. పాములు పట్టడంలో నేర్పరి అయిన సోను ఠాకుర్​ ఇది గమనించి.. తన బృందంతో కలిసి ప్రాణాలకు తెగించి కుక్కను రక్షించాడు. 200 అడుగుల కొండపైనుంచి తాళ్ల సాయంతో కిందికి దిగి శునకాన్ని పైకి తీసుకెళ్లాడు. ఈ సాహసోపేత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. సోనూను అంతా ప్రశంసిస్తున్నారు. గతంలో దాదాపు 600కుపైగా పాములను రక్షించి అడవిలో వదిలిపెట్టాడు సోను.

ABOUT THE AUTHOR

...view details