ప్రతిధ్వని: పైపైకి ఇంధన ధరలు.. సామాన్యుడి అవస్థలు - ప్రతిధ్వని చర్చ
కరోనా సంక్షోభంతో ఆదాయం లేక అవస్థలు పడుతున్న సామాన్యులపై.. రోజూ పైపైకి ఎగబాకుతున్న ఇంధన ధరల పరుగు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈనెల ఏడో తేదీన మొదలైన పెట్రో ధరల మోత ఇవాళ కూడా కొనసాగింది. వరుసగా 13వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా.. అందుకు తగ్గట్టుగా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గాల్సింది పోయి.. మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ధరల పెరుగుదలపై ప్రతిధ్వని చర్చ..