PRATHIDWANI: క్వారీల కాలుష్యం నియంత్రణలో ప్రభుత్వం, పౌర సమాజం బాధ్యత ఏంటి?
ఇష్టారాజ్యంగా వెలుస్తున్న క్వారీలు, కంకర మిల్లులు, హాట్ మిక్స్ ప్లాంట్లు పర్యావరణానికి సవాళ్లు విసురుతున్నాయి. తరచుగా ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నాయి. అసలేందుకు ఈ సమస్య ఏర్పడుతోంది. వీటి నుంచి ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది. తరచుగా ఫిర్యాదులు అందుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలేంటి? అనేే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.