PRATHIDHWANI: చరిత్ర రచనలో కాకతీయ గుడులు, శిల్పాలు పోషిస్తున్న పాత్రేంటి? - హైదరాబాద్ తాజా వార్తలు
PRATHIDHWANI: ఏడు తరాల కాకతీయ చరిత్ర విశిష్టతను చాటిచెప్పడమే లక్ష్యంగా కాకతీయ వైభవ సప్తాహం వరంగల్ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. కాకతీయ వంశీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలను ప్రభుత్వం ఏడు రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆ కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, శత్రు దుర్బేధ్యమైన కోటల ఘనతను కళ్లకు కట్టనున్నారు. కాకతీయులు సృష్టించిన అద్భుతమైన శిల్పసంపద-నాట్య కళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తారు. ఈ నేపథ్యంలో భారతీయ చరిత్రలోనే తరగని కీర్తి ప్రతిష్ఠలు మూట గట్టుకున్న కాకతీయ సామ్రాజ్య వైభవంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.