Prathidwani: ప్రతిపక్ష నేతలకు మమతాబెనర్జీ రాసిన లేఖను ఎలా చూడాలి? - ప్రధాని మోదీ తాజా వార్తలు
Prathidwani: ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం. మరొకవైపు ముందస్తు ఎన్నికల ముచ్చట్లు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి వరకు. ప్రస్తుతం ఇదే రాజకీయ ముఖచిత్రం. ఈ హడావుడిలోనే.. కాబోయే రాష్ట్రపతి ఎవరనే దానికంటే... మోదీ - షా ద్వయానికి ఎదురు నిలిచే కూటమి ఎవరన్నదే ఇప్పుడు అంతా ఆసక్తిగా గమనిస్తున్న విషయం. ఇప్పటి వరకు ఎలా ఉన్నా... ఏం మాట్లాడినా... ఆయా ప్రాంతీయపార్టీల అసలు స్టాండ్ ఏమిటో కూడా చెప్పే సందర్భం కావడంతో... రాష్ట్రపతి ఎన్నికల సమయం ఎప్పుడా... అని ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎన్డీయే వర్సెస్ దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలన్నీ అన్నట్లుగా మారిన ఈ పోరాటంలో ఎవరు ఎటువైపు. 22మంది ప్రతిపక్ష నేతలకు మమతాబెనర్జీ రాసిన లేఖను ఎలా చూడాలి? రానున్న రోజుల్లో ఈ సమీకరణాలు ఎలా మారనున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.