Prathidhwani: ఏ నిబంధన ప్రకారం తొలగించారు.. కొత్తగా ఎంతమందికి జారీ చేశారు? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం
Prathidhwani: రాష్ట్రంలో మూకుమ్మడిగా చేపట్టిన రేషన్ కార్డుల రద్దు ప్రక్రియపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ నిబంధన ప్రకారం తన రేషన్ కార్డులు రద్దయ్యాయో తెలుసుకునే అవకాశం కూడా ప్రజలకు లేకపోవడం ఏమిటని కోర్టు నిలదీసింది. అయితే కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్రం ఇచ్చిన సమాధానంపై కోర్టు సంతృప్తి చెందలేదు. అసలు రేషన్ కార్డుల రద్దుకు సంబంధించి రాష్ట్రంలో ఏం జరిగింది? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.