తెలంగాణ

telangana

ETV Bharat / videos

మితిమీరుతున్న ఆన్‌లైన్‌ రుణయాప్‌ల ఆగడాలు.. నిబంధనలు ఏం చెప్తున్నాయి?

By

Published : Jul 22, 2022, 10:21 PM IST

PRATHIDHWANI: ఆన్‌లైన్ రుణ యాప్‌ల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. అప్పులు తీసుకున్న వారి నుంచి సకాలంలో డబ్బులు రాకపోతే... బాకీ వసూళ్ల పేరుతో వారిని దారుణంగా అవమానిస్తున్నారు. ఇల్లూ, వాకిలీ, కాలనీ, కార్యాలయం అనే తేడా లేకుండా నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నారు. అసభ్య మెసేజ్‌లు, మార్ఫింగ్‌ ఫోటోలు పంపిస్తూ బంధుమిత్రుల ముందు పరువు తీస్తున్నారు. రుణ యాప్‌ల అధిక వడ్డీలు, మితిమీరిన జరిమానాలతో అప్పుల ఉచ్చులో చిక్కుతున్న కొందరు సామాన్యులు మనస్తాపానికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తక్షణ రుణ సహాయం ఎరగా వేసి, జనం జేబులు ఖాళీ చేస్తున్న రుణ యాప్‌ల ఆర్థిక కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉందా? రుణ యాప్‌ల వలలో చిక్కి వేధింపులకు గురవుతున్న బాధితులు ఎక్కడ ఫిర్యాదు చేయాలనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details