తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఏనుగుల బీభత్సం.. కార్లపై దాడి.. వాటి కోసమే! - ఏనుగుల బీభత్సం

By

Published : Jun 26, 2022, 2:30 PM IST

elephants attack cars: కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుపిల్లతో సహా రోడ్డుపైకి వచ్చిన రెండు గజరాజులు కార్లపై దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసు కారు తప్పించుకోగా మరో కారు ధ్వంసం అయ్యింది. చామరాజనగర్​ సమీపంలోని అసనుర్​ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఏనుగుల రోడ్డు పైకి రావడం వల్ల అర గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగులను అడవుల్లోకి తోలి, ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు. చెరకు తినడానికి అలవాటు పడ్డ ఏనుగులు.. వాటి కోసం ట్రక్కులను ఆపుతూ ఇలా చేస్తున్నాయని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details