నదిలో చిక్కుకుపోయిన ఏనుగు.. వరద ప్రవాహంలో గంటలపాటు అక్కడే.. - కేరళ న్యూస్
కేరళ త్రిస్సూర్‌లోని చాలకుడి నదిలో ఏనుగు చిక్కుకుపోయింది. అనేక గంటల పాటు నదిలోనే వరద ప్రవాహంలో ఉండిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నది ఐదు అడుగుల మేర పైకి ప్రవహిస్తోంది. ఆహారం కోసం వచ్చిన ఏనుగు.. తిరిగి అడవిలోకి వెళ్తుండగా నదిలో చిక్కకుపోయింది. అతిరప్పిలి జలపాతం వద్ద నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువైంది. దీంతో ఏనుగు కొంత దూరం కొట్టుకుపోయింది. చివరకు ఓ చెట్టును పట్టుకుని నిల్చొంది. తర్వాత వరద ప్రవాహం తగ్గిందని చెప్పిన అటవీ అధికారులు.. ఏనుగు అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు.