క్రేజీ బామ్మ.. 70+ ఏజ్‌లో బ్రిడ్జ్ పైనుంచి నదిలోకి డైవ్.. యూత్‌కు పోటీగా... - హరిద్వార్‌లో గంగానదిలో దూకిన బామ్మ
హరియాణాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఉత్తరాఖండ్.. హరిద్వార్‌లోని హర్కీ పౌడీ ఘాట్ వంతెనపై నుంచి గంగానదిలోకి దూకి.. సునాయాసంగా ఒడ్డుకు చేరుకుంది. ఆ సమయంలో వంతెనపై నుంచి నదిలో దూకుతున్న యువకులను చూసి ఉత్సాహంతో ఇలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బామ్మ సాహసాన్ని చూసి యాత్రికులు ఆశ్చర్యపోతున్నారు.