25 తలల దుర్గమ్మ.. చూడటానికి రెండు కళ్లు చాలవమ్మా..
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో దేవీ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బోధన్ మండలంలోని సాలుర గ్రామంలో 25 శిరస్సులతో దుర్గమ్మను నెలకొల్పారు. మహారాష్ట్రలోని ఉమ్మర్ ఖేడ్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చామని.. తొమ్మిది రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 25 తలల దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.