తాగి కారు నడిపి మహిళా అధికారి రచ్చ.. పోలీసులతో గొడవ - Rachna Kesarwani
మద్యంమత్తులో కారు నడిపి రచ్చరచ్చ చేసింది ఉత్తర్ప్రదేశ్ దేవీపాటన్ మహిళా డిప్యూటీ లేబర్ కమిషనర్ రచనా కేసార్వాని. లఖ్నవూ నుంచి గోండా వెళ్తున్న ఆమె.. మత్తులో దారి మరిచిపోయి బహ్రాయిచ్ వైపు కారును మళ్లించింది. ఈక్రమంలోనే వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కారు నుంచి బయటకు దింపారు. డ్రైవింగ్ చేయొద్దని చెప్పి.. వెనకాల సీట్లో కూర్చొబెట్టారు. కానీ రచనా కేసార్వాని మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను జిల్లా స్థాయి అధికారిని కాదు, డివిజనల్ స్థాయి అధికారినని, తనను ఆపొద్దని పోలీసులతో వాదించారు. పదే పదే డ్రైవర్ సీట్లోనే కూర్చునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెను కంట్రోల్ చేయలేక మహిళా పోలీసులు తంటాలు పడ్డారు. చివరకు రచన భర్తకు ఫోన్ చేసి రప్పించి అతనికే ఆమెను అప్పగించారు. ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆదివారం వైరల్గా మారింది.
Last Updated : May 2, 2022, 7:33 PM IST