ఫుడ్ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు.. లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా.. - ఫుడ్ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు
కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని ఠాణెలో జరిగింది. పన్వెల్ ప్రాంతంలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్‌కు పార్సిల్ ఇవ్వడానికి జొమాటో డెలివరీ బాయ్ వెళ్లాడు. ఆ తర్వాత లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడే ఉన్న ఓ కుక్క ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కరిచింది. వెంటనే గమనించిన స్థానికులు.. అతడ్ని డీవై పాటిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆగస్టు 27న జరిగింది.