ఓరుగల్లులో 'డీజే టిల్లు' సందడి.. సెల్పీల కోసం ఎగబడిన యువత - jonnalagadda siddhu
DJ TILLU Actors in Warangal: వరంగల్లో 'డీజే టిల్లు' హీరో హీరోయిన్లు సిద్ధు, నేహాశెట్టి సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రదుకాణాన్ని వారు తమ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వారితో సెల్ఫీ తీసుకోవడానికి ఉత్సాహం చూపారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సినీనటులు సిద్ధు, నేహాశెట్టిని చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డీజే టిల్లు, రాధికా అంటూ అరుస్తూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.