ఈటీవీ 25వ వార్షికోత్సవం... దర్శకేంద్రుడి శుభాకాంక్షలు - ఈటీవీ సిల్వర్ జూబ్లీ
ఈటీవీ 25వ వార్షికోత్సవాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఈటీవీ సిబ్బందికి అభినందనలు చెప్పారు. అన్నదాతలు, మహిళలకు ప్రత్యేక కార్యక్రమాల్లో ఈటీవీ తనకు తానే సాటి అని రాఘవేంద్రరావు అన్నారు. శాంతినివాసంతో ఈటీవీతో తన ప్రయాణం ప్రారంభమైందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలతో తన ప్రయాణం ఈటీవీతో కొనసాగాలని కోరుకున్నారు.
Last Updated : Aug 27, 2020, 7:10 AM IST