వనస్థలిపురం వేంకటేశ్వరస్వామికి స్వర్ణ శంఖుచక్రాలు బహూకరణ - శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం
హైదరాబాద్‌లోని వనస్థలిపురం శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుంది. నేడు శ్రీవారికి బంగారు శంఖు చక్రాలను కొందరు భక్తులు విరాళంగా అందచేశారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వాటికి విశేష పూజలు చేసి స్వామి వారికి అలంకరించారు. అనంతరం దాతలను దేవస్థానం పాలకమండలి అభినందించింది. ఇలాగే గతంలో పాలకవర్గం వారి కృషితో స్వామి వారికి బంగారు కిరీటం, పాదాలు భక్తులు సమర్పించారు.