రాంగ్ రూట్‌లో ట్రిపుల్ రైడింగ్.. ఆపినందుకు ట్రాఫిక్ పోలీసులపై యువతుల దాడి - దిల్లీ పోలీసులు
Delhi Traffic video viral: ఓ యువకుడు, ఇద్దరు యువతులు కలిసి పోలీసులపైకి దాడికి దిగిన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది.హెల్మెట్ లేకుండా రాంగ్ రూట్‌లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురిని పోలీసులు అడ్డుకున్నారు. బైక్ నడుపుతున్న.. యువకుడు పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడు. తమను ఎందుకు అడ్డుకున్నారని వారితో వాగ్వాదానికి దిగాడు. యువతులు సైతం పోలీసులపైకి దాడికి దిగారు. ఈ క్రమంలో అక్కడ కొద్ది సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించడంతో పాటు అనుచితంగా ప్రవర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.