సామాజిక దృక్పథానికి తన కళనే ఓ పథమాయే! - CUBIC
అమెరికాలో పుట్టి పెరిగి క్యూబిక్గేమ్లో జాతీయ రికార్డు సాధించిన హర్షవర్ధన్ హైదరాబాద్లో క్యూబిక్పోటీలను నిర్వహించాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా...! ఈ పోటీలతో వచ్చిన డబ్బులను ల్యుకేమియాతో బాధపడుతున్న రోగులకు ఆర్థిక సహాయం చేయాలన్నదే ఆ కుర్రాడి లక్ష్యం. అంతేకాదు గెలిచినవారికి ప్రపంచ క్యూబింగ్ అసోసియేషన్ సర్టిఫికెట్లను అందజేయనుంది. 15ఏళ్ల హర్ష వర్ధన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందనే లభించిందండోయ్....