రైలు ఇంజిన్‌పైకి 100 మంది.. పండుగని.. - train crowd viral video
రైలు ఇంజిన్‌పై ఒకేసారి దాదాపు 100 మంది ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత మంది ఒకేసారి ఇంజిన్‌పైకి ఎందుకు ఎక్కారు? వీరంతా అలానే ఎక్కడికైనా వెళ్తున్నారా? అని నెట్టింట చర్చ జరిగింది. అయితే.. ఈ వీడియో ఉత్తర్‌ప్రదేశ్ బలియా రైల్వే స్టేషన్లో తీసినది. దగ్గర్లో జరుగుతున్న మహావీర్ జెండా ఉత్సవాన్ని చూసేందుకు వారంతా ఇలా ఆగి ఉన్న ఇంజిన్‌పై ఎక్కారు.