గ్రామంలోకి మొసలి.. స్థానికులు హడల్.. 3గంటల పాటు శ్రమించి.. - Ibrahimpur village of Roorkee
ఉత్తరాఖండ్.. హరిద్వార్‌లోని ఇబ్రహీంపుర్‌లో జనావాసాల్లోకి వచ్చిన ఓ మొసలిని అటవీ శాఖ అధికారులు బంధించారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. మూడు గంటలపాటు శ్రమించి మొసలిని పట్టుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న సొలాని నదిలో మొసళ్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని ఖాళీ స్థలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల మొసలి అందులోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.