యువకుడ్ని పొట్టనపెట్టుకున్న మొసలి.. రెండు గంటల పాటు చెలగాటం ఆడి.. - యువకుడ్ని చంపిన మొసలి
Crocodile Kills Young Man: గుజరాత్లోని వడోదరా సమీప ప్రాంతాల్లో ప్రవహిస్తున్న విశ్వామిత్ర నదిలో 30 ఏళ్ల యువకుడ్ని ఓ మొసలి పొట్టనపెట్టుకుంది. సుమారు రెండు గంటల పాటు యువకుడి మృతదేహంతో మకరం చెలగాటం ఆడింది. విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు.. ఘటనను చూసేందుకు పెద్ద ఎత్తున నది ఒడ్డుకు చేరుకున్నారు. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి.. మృతుడ్ని పాద్రా గ్రామానికి చెందిన ఇమ్రాన్గా గుర్తించారు.
Last Updated : Aug 8, 2022, 1:17 PM IST