తెలంగాణ

telangana

ETV Bharat / videos

కారులో వచ్చి కక్కుర్తి పని.. రోడ్డు పక్కనున్న పూలకుండీలు చోరీ - బెంగళూరలో కుండీలను చోరి చేసిన జంట

By

Published : Sep 20, 2022, 5:14 PM IST

బెంగళూరులోని బనశంకరి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. బసవన​గుడి స్టూడియో రోడ్డులో అర్ధరాత్రి ఓ కారు ఆగింది. అందులో నుంచి ఓ జంట దిగింది. క్షణాల్లోనే వారిద్దరూ ఎవరికి వారు బిజీబిజీ అయిపోయారు. ఒకరేమో కారు అద్దాలను క్లీన్​ చేస్తున్నట్లు నటిస్తే.. మరొకరేమో ఫుట్​పాత్​ పైనున్న కుండీలను కొట్టేశారు. వాటిని కారు డిక్కీలో పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు పరారయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details