రెండు రోజులుగా ఇంటి పైకప్పుపైనే.. చిన్నారి, బామ్మను ప్రాణాలకు తెగించి..
గుజరాత్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత ప్రజలు ఈ వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కావేరి నది ఉద్ధృతి వల్ల వల్సాద్ జిల్లా టోర్నా గ్రామస్థులు గురువారం రోజు వరదల్లో చిక్కుకున్నారు. 72 ఏళ్ల బామ్మ, ఆమె కోడలు, 11 నెలల వయసున్న మనుమరాలు ఇంటి పైకప్పుపైనే రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. వీరిని కాపాడేందుకు అండమాన్ కోస్ట్ గార్డు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. హెలికాప్టర్లో వీరిని చాకచక్యంగా కాపాడి.. గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో వదిలిపెట్టింది. కోస్ట్ గార్డు సిబ్బందిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.