సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.. గోదావరి మహోగ్రరూపం విహంగ వీక్షణం.. - సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
CM KCR Arial Survey: భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అనంతరం ఏటూరు నాగారం వెళ్తూ హెలీకాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మహోగ్రరూపాన్ని దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం పరిశీలించారు. వరదలతో నదికి ఇరువైపులా ముంపునకు గురైన గ్రామాల పరిస్థితిని అధికారులతో కలిసి స్వయంగా వీక్షించారు. వరదలతో ఎంత మేర నష్టం వాటిల్లిందన్నది.. అధికారులతో సమీక్షించారు.