సభలో రాజన్న పాట పాడిన వెంకాయమ్మ, ఆపమన్న జగన్ - ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమంలో సరదా సన్నివేశం
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న కార్యక్రమంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహావిష్కరణ తర్వాత నిర్వహించిన సభలో ముఖ్యమంత్రితోపాటు ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి సుబ్బారెడ్డి భార్య వెంకాయమ్మ వైఎస్‌ఆర్‌పై ఓ పాట పాడారు. కొద్దిసేపు పాడిన తర్వాత.. ఇక చాలని సీఎం జగన్ సూచించినా ఆమె పట్టించుకోలేదు. అదే ఒరవడితో పాట కొనసాగించారు. వెంటనే తన స్థానం నుంచి లేచి వచ్చిన జగన్, వెంకాయమ్మను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ పరిణామంతో సభలో నవ్వులు విరిశాయి.