'క్లౌడ్ బరస్ట్' బీభత్సం.. పోటెత్తిన వరద.. విరిగిపడ్డ కొండచరియలు - హిమాచల్ ప్రదేశ్ వర్షాలు
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరద సంభవించింది. కొండ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరద పోటెత్తి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.