ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల ఘర్షణ.. విరిగిన కుర్చీలు.. పగిలిన అద్దాలు.. - వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు
అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సర్వసభ్య సమావేశాలు తమిళనాడు.. చెన్నైలో జరుగుతున్నాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోగా.. పన్నీర్సెల్వానికి మద్దతిస్తున్న వారు నినాదాలు చేయడం వల్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. కొందరు కార్యకర్తలు రాళ్లు రువ్వగా పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.