చిన్నారిపై పడగెత్తిన నాగుపాము చాకచక్యంగా కాపాడిన తల్లి - కర్ణాటక మండ్య న్యూస్
కర్ణాటక మండ్యలోని ఓ బాలుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన చిన్నారి ఇంటి బయటకు వచ్చాడు. అప్పుడు డోర్ వద్ద ఉన్న నాగుపామును చిన్నారి గమనించలేదు. సర్పంపై అడుగువేయబోయి దానిని దాటి బయటకు వచ్చేశాడు. అనంతరం పామును చూసిన బాలుడు మళ్లీ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విషసర్పం వెంటనే చిన్నారిపై పడగెత్తింది. అంతలోనే బాలుని తల్లి పక్కకు లాగి అతడిని కాపాడింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బాలుని తల్లి ధైర్యాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
Last Updated : Aug 13, 2022, 7:01 PM IST