తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త ఇంటిపై పెట్రోల్​ బాంబ్ దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ - ఆర్​ఎస్​ఎస్​ నేత ఇంటిపై పెట్రోల్​ బాంబ్​ దాడులు

By

Published : Sep 25, 2022, 10:20 AM IST

పీఎఫ్​ఐపై జాతీయదర్యాప్తు సంస్థ సోదాల తర్వాత తమిళనాడులో పెట్రోల్​ బాంబ్​ దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం రాత్రి మధురైలోని ఆర్​ఎస్​ఎస్​ నేత ఇంటిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి మూడు పెట్రోల్​ బాంబులను విసిరాడు. ఆ తర్వాత బైక్​పై ఎక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఇదే తరహాలో సెప్టెంబర్ ​22న భాజపా కార్యాలయంపై దాడులు జరిగాయి. ఆ మరుసటిరోజే భాజపా నేత శరత్​ ఇంటిపై పెట్రోల్​బాంబ్​తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసమయ్యింది. సెప్టెంబర్ 24న ఉదయం తాంబరంలోని ఆర్​ఎస్​ఎస్​ జిల్లా కోఆర్టినేటర్​ సీతారామన్ ఇంటిపైన కూడా దాడులు జరిగాయి. ​

ABOUT THE AUTHOR

...view details