వెంటిలేటర్లో ఇరుక్కున్న పిల్లి.. గంటలపాటు ఉక్కిరిబిక్కిరి! - వెంటిలేటర్లో తలపెట్టిన పిల్లి
పిల్లి తల వెంటిలేటర్లో ఇరుక్కుని విలవిలలాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆదివారం జరిగింది. దీంతో బయటకు రాలేక ఆ మూగ జీవి కాసేపు అవస్థలు పడింది. ఆగ్రాలోని ఎత్మాద్ధౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాజీర్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో పిల్లి తల ఇరుక్కొగా.. పలువురు స్థానికులు పిల్లిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయినా మూగజీవి తల వెంటిలేటర్ నుంచి బయటకు రాలేదు. ఇంక చేసేదేమీ లేక కట్టర్‌ను తెచ్చి వెంటిలేటర్‌ను కట్ చేయించారు. అనంతరం పిల్లిని సురక్షితంగా కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు.
Last Updated : Jul 5, 2022, 9:59 AM IST